Rajasekhar: 'శేఖర్' తరువాత సైలెంటైన రాజశేఖర్ !

Rajasekhar Special

  • రాజశేఖర్ నుంచి వచ్చిన 'శేఖర్'
  • మలయాళం సినిమాకి ఇది రీమేక్ 
  • థియేటర్లలో నిలబడలేకపోయిన సినిమా 
  • ఆయన నిర్ణయం తెలుసుకోవాలనే ఆసక్తితో ఫ్యాన్స్

రాజశేఖర్ స్టైలీష్ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంది. ఇటు యాక్షన్ హీరోగాను .. అటు ఫ్యామిలీ హీరోగాను మంచి మార్కులు కొట్టేయడం ఆయనకే సాధ్యమైంది. ఇక పవర్ఫుల్ పోలీస్ పాత్రలకి ఆయన కేరాఫ్ అడ్రెస్ గా నిలిచారు. 

అలాంటి రాజశేఖర్ 'శేఖర్' సినిమా నుంచి సైలెంట్ అయ్యారు. నిజానికి ఈ సినిమాతో పాటు మరో మూడు ప్రాజెక్టులు లైన్లో ఉన్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. కానీ ఆ ప్రాజెక్టులేవీ సెట్స్ పై సందడి చేస్తున్న దాఖలాలైతే కనిపించడం లేదు. 

'శేఖర్' సినిమా .. మలయాళంలో హిట్ కొట్టిన 'జోసెఫ్'కి రీమేక్. ఈ సినిమా రీమేక్ కి మంచి టాక్ వచ్చింది .. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా థియేటర్స్ లో ఎక్కువ రోజులు నిలబడలేకపోయింది. అప్పటి నుంచి రాజశేఖర్ సైలెంట్ కావడం కనిపిస్తోంది. ఆయన నిర్ణయమేమిటనేది తెలుసుకోవాలనే ఆసక్తితో అభిమానులు ఉన్నారు. 

Rajasekhar
Actor
Shekar Movie
  • Loading...

More Telugu News