Venkatesh: అప్ డేట్స్ కి దూరంగా వెంకటేశ్ 'సైంధవ్'!

Saindhav movie update

  • వెంకటేశ్ హీరోగా రూపొందుతున్న 'సైంధవ్'
  • కథానాయికగా కనిపించనున్న శ్రద్ధా శ్రీనాథ్
  • సంగీతాన్ని అందిస్తున్న సంతోష్ నారాయణ్ 
  • డిసెంబర్ 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు 

'ఎఫ్ 3' సినిమా తరువాత వెంకటేశ్ పూర్తిస్థాయి హీరోగా మరే సినిమాలోనూ కనిపించలేదు. ఆ సినిమా తరువాత ఆయన 'ఓరి దేవుడా' సినిమాలో అతిథి పాత్రలోను .. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' సినిమాలో ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అప్పటి నుంచి వెంకీ అభిమానులంతా, ఆయన తాజా చిత్రమైన 'సైంధవ్' కోసం వెయిట్ చేస్తున్నారు. 

శైలేశ్ కొలను దర్శకత్వంలో ఈ  సినిమా రూపొందుతోంది. యాక్షన్ హీరోగా వెంకటేశ్ లుక్ అందరిలోనూ ఆసక్తిని పెంచుతూ వెళ్లింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో శ్రద్ధ శ్రీనాథ్ .. ఆండ్రియా .. రుహాని శర్మ కనిపిస్తారు. ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్ధికీ కనిపించనున్నాడు. వీరి పాత్రలను పరిచయం చేస్తూ పోస్టర్లను కూడా వదిలారు. 

సంతోష్ నారాయణ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, డిసెంబర్ 22వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత నుంచి మాత్రం ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదు. విడుదలకి ఇంకా 6 నెలల ముందే హడావిడి ఎందుకు అనుకున్నారో .. లేదంటే ఇప్పటికింతే అనుకున్నారో తెలియదుగానీ, ప్రస్తుతానికైతే సైలెంట్ అయ్యారు.

Venkatesh
Shraddha Srinath
Nawajuddin
Saindhav Movie
  • Loading...

More Telugu News