Naresh: ఒకే రోజు రెండు ఓటీటీల్లో విడుదల కానున్న 'మళ్లీ పెళ్లి'

Naresh and Pavitra Lokesh Malli Pelli movie coming to OTT

  • మే 26న థియేటర్లలో విడుదలైన 'మళ్లీ పెళ్లి'
  • నరేశ్, పవిత్ర లోకేశ్ ల జీవితాల ఆధారంగా తెరకెక్కిన చిత్రం
  • జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహాల్లో స్ట్రీమింగ్

సినీ పరిశ్రమలో సీనియర్ నటుడు నరేశ్, నటి పవిత్రా లోకేశ్ లు గత కొంత కాలంగా హాట్ టాపిక్ గా ఉన్నారు. ఇద్దరూ సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. 60 ప్లస్ వయసులో ఉన్న నరేశ్, 40 ప్లస్ వయసులో ఉన్న పవిత్ర కలిసి జీవిస్తున్నారు. వీరి ఇద్దరి జీవితాలలో జరిగిన ఘటనల ఆధారంగా 'మళ్లీ పెళ్లి' సినిమాను తెరకెక్కించారు. పలు వివాదాల మధ్య ఈ చిత్రాన్ని మే 26న థియేటర్లలో విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ చిత్రంపై ఎంతో క్రేజ్ వచ్చినప్పటికీ... బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ సినిమా బోర్లా పడింది. మరోవైపు ఈ చిత్రం ఓటీటీల్లో విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఒకేసారి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆహా సంస్థలు ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి.

More Telugu News