Ntr: బ్రాండ్ అంబాసిడర్ గాను ఎన్టీఆర్ రేంజ్ వేరేనే!

 Ntr deal with malabar gold and diamonds

  • 'ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ 
  • ఆయన కోసం పోటీపడుతున్న బ్రాండింగ్ సంస్థలు 
  • తాజాగా 'మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్'తో ఒప్పందం 
  • అందుకుగాను కోట్లలో పారితోషికం అందుకున్న ఎన్టీఆర్

స్టార్ హీరోలు ఇప్పుడు ఒక వైపున సినిమాలతో .. మరో వైపున బడా వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకుగాను వాళ్లకి ముట్టే పారితోషికం కోట్లలోనే ఉంటుంది. అందువలన స్టార్ హీరోలు తమకి నచ్చిన బ్రాండ్స్ కి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇలా ఈ వైపు నుంచి మహేశ్ బాబు .. చరణ్ .. అల్లు అర్జున్ .. ఎన్టీఆర్ బిజీగానే ఉన్నారు. 

ఇటు నార్త్ లోను .. సౌత్ లోను మంచి క్రేజ్ .. మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోలనే ఈ సంస్థలు అంబాసిడర్లుగా ఎంచుకుంటూ ఉంటాయి. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అందువలన ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి కొన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి. 

తాజాగా 'మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్' సంస్థవారు ఎన్టీఆర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాలలో ఎన్టీఆర్ నటించవలసి ఉంటుంది. అందుకుగాను కోట్ల రూపాయల డీల్ ను ఈ సంస్థతో ఆయన కుదుర్చుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన కొరటాలతో 'దేవర' చేస్తున్న సంగతి తెలిసిందే. 

Ntr
Malabar Gold and Diamonds
  • Loading...

More Telugu News