Thaman: గుంటూరు కారం రూమర్స్ పై ఘాటుగా స్పందించిన తమన్

Thaman sharply reacts about rumors on Guntur Kaaram

  • మహేశ్ బాబు 28వ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం
  • గుంటూరు కారం అంటూ ఇటీవల టైటిల్ ఫిక్స్
  • తాజాగా గుంటూరు కారంపై రూమర్ల వెల్లువ
  • తమన్ ను తప్పించారంటూ పుకార్లు
  • తమనే వెళ్లిపోయాడంటూ మరికొన్ని పుకార్లు
  • కడుపుమంట అంటూ తమన్ వ్యాఖ్యలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గుంటూరు కారం. ఇటీవల టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ మరీ పెరిగిపోయింది. అదే సమయంలో రూమర్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. 

సంగీత దర్శకుడు తమన్ ను ఈ సినిమా నుంచి తప్పించారని కొన్ని పుకార్లు, తమనే తప్పుకున్నాడని మరి కొన్ని పుకార్లు వచ్చాయి. తమన్ వెళ్లిపోవడంతో, అతడి స్థానంలో తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ను తీసుకున్నారన్నది ఆ పుకార్ల సారాంశం. 

దీనిపై తమన్ ఘాటుగా స్పందించాడు.  తన ఆఫీసు వద్ద ఉచితంగా మజ్జిగ పంపిణీ చేస్తున్నానని, ఎవరైనా కడుపు మంటతో బాధపడుతున్నవారు వచ్చి ఆ మజ్జిగ తాగాలని వ్యంగ్యం ప్రదర్శించాడు. అప్పటికీ మంట తగ్గకపోతే అరటిపండ్లు తినండి అని సలహా ఇచ్చాడు. 

దయచేసి నా టైమ్ వేస్ట్ చేయొద్దు... మీ టైమ్ కూడా ముఖ్యమైనదే కదా అని ట్వీట్ వచేశాడు.

Thaman
Guntu Kaaram
Rumors
Music Director
Mahesh Babu
Trivikram Srinivas
SSMB28
Tollywood
  • Loading...

More Telugu News