Adipurush: వర్కింగ్ డే రోజున కూడా జోరు తగ్గలేదు.. తెలుగు రాష్ట్రాల్లో 'ఆదిపురుష్' నాలుగో రోజు వసూళ్లు ఇవే!

Adipurush 4 days collections

  • ఈ నెల 16న విడుదలైన 'ఆదిపురుష్'
  • సోమవారం వరకు రూ. 375 కోట్ల వసూళ్లు  
  • నిన్న రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్లు 

ఈ నెల 16న విడుదలైన ప్రభాస్ తాజా చిత్రం 'ఆదిపురుష్' భారీ వసూళ్లను సాధిస్తోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రం... సోమవారం కూడా అదే ట్రెండ్ ను కొనసాగించింది. తొలి నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 375 కోట్లను వసూలు చేసింది. సోమవారం వర్కింగ్ డే అయినప్పటికీ... రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించి సత్తా చాటింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సోమవారం నాడు ఏపీలో రూ. 2.69 కోట్లు, నైజాంలో రూ. 2.74 కోట్లను వసూలు చేసింది.

Adipurush
Collections
Tollywood
Bollywood

More Telugu News