Rohith: 'నమ్మించడం కష్టం .. ప్రేమించడం ఈజీ: 'లవ్ యూ రామ్' ట్రైలర్ డైలాగ్!

Love You Ram trailer released

  • డివై చౌదరి దర్శకుడిగా 'లవ్ యూ రామ్'
  • అభిప్రాయాలు కలవని ఓ జంట ప్రేమకథ 
  • కథానాయికగా అపర్ణ జనార్దన్ పరిచయం
  • ప్రత్యేక ఆకర్షణగా వేద సంగీతం  
  • ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల

కంటెంట్ బాగుండాలేగానీ .. ప్రేమకథా చిత్రాలు ఎక్కువ మార్కులు కొట్టేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అలాగే యూత్ నుంచి హిట్ అందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదు. అందువల్లనే ప్రేమకథా చిత్రాలు వరుసగా తెలుగు తెరపైకి వస్తుంటాయి. అలా రూపొందిన మరో ప్రేమకథా చిత్రమే 'లవ్ యూ రామ్'. 

ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ను కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. ఈ కథ ఇటు ఇండియాలోను .. అటు ఫారిన్ లోను నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. పెళ్లి విషయంలో అబ్బాయి సిద్ధాంతం వేరు .. అమ్మాయి అభిప్రాయం వేరు. నమ్మించడమే జీవితమనేది అతని పద్ధతి .. ప్రేమించడమే జీవితమనేది ఆమె తీరు. అలాంటి ఈ ఇద్దరి మధ్య నడిచే కథనే ఈ సినిమా. 

'నమ్మించడం కంటే ప్రేమించడం ఈజీ' అనేది ఈ ట్రైలర్ లో వినిపించిన లోతైన డైలాగ్. కొత్త ఆర్టిస్టులే ఎక్కువగా కనిపిస్తున్నారు .. హీరోయిన్ అపర్ణ జనార్దన్ అట .. బాగానే ఉంది. 'సంతోషం' .. మిస్టర్ పెర్ఫెక్ట్' వంటి సినిమాలను తెరకెక్కించిన దశరథ్ ఈ సినిమాకి నిర్మాత. డివై చౌదరి దర్శకత్వం వహించాడు. ట్రైలర్ లో చూపించిన రెండు పాటలూ బాగున్నాయి. వేద సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.

Rohith
Aparna Janardhan
Dahsarath
Love You Ram Movie

More Telugu News