Nagashourya: 'రంగబలి' నుంచి హుషారెత్తిస్తున్న బీట్!

Rangabali Movie Full Song Released

  • నాగశౌర్య హీరోగా రూపొందిన 'రంగబలి'
  • ఆయన జోడీగా మెరవనున్న యుక్తి తరేజా
  • యూత్ ను అలరిస్తున్న పవన్ సీహెచ్ సంగీతం 
  • జులై 7వ తేదీన సినిమా విడుదల

కొంతమంది అమ్మాయిలకు కాస్త సున్నితంగా ఉండే అబ్బాయిలు నచ్చుతూ ఉంటారు. మరికొంతమంది కాస్త రఫ్ గా ఉండే కుర్రాళ్లపై మనసులు పారేసుకుంటూ ఉంటారు. అయితే ఒక కుర్రాడు మాత్రం బాగా రఫ్. కానీ తనని ప్రేమించిన యువతి ముందు మాత్రం కాస్త అమాయకంగా యాక్ట్ చేస్తుంటాడు. ఇంత అమాయకంగా ఉంటే కష్టమని ఆ బ్యూటీనే అనేలా జీవిస్తాడు. 

అంతలా యాక్ట్ చేసే ఆ కుర్రాడిపేరు నాగశౌర్య అయితే, అతని నటనను నిజమని నమ్మిన ఆ సుందరి పేరు యుక్తి తరేజా. 'రంగబలి' సినిమా కోసం ఈ ఇద్దరూ ఇలా కనిపించనున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన అప్ డేట్స్ యూత్ లో ఆసక్తిని పెంచాయి. ఈ నేపథ్యంలో కొంత సేపటి క్రితం ఈ సినిమా నుంచి  ఒక ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 

"కలకంటూ ఉంటే అది కరిగి కరిగి' అంటూ ఈ పాట సాగుతోంది. పవన్ సీహెచ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా .. సార్థక్ కల్యాణి - వైష్ ఆలపించారు. జులై 7వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న నాగశౌర్యకి, ఈ సినిమాతో సక్సెస్ దొరుకుతుందేమో చూడాలి.

Nagashourya
Yukthi Tareja
Pavan Basam Shetty
Rangabali Movie

More Telugu News