: బుట్టలో పడ్డ బ్యాంకు మేనేజర్


ఆయన అన్నీ తెలిసిన బ్యాంకు మేనేజరే. కానీ, మాయగాళ్ల వలకు చిక్కాడు. లాటరీలో మూడు కోట్లు వచ్చాయన్న ఆన్ లైన్ మోసానికి బలయ్యాడు. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ బాలకృష్ణకు 3కోట్ల లాటరీ తగిలిందంటూ సమాచారం వచ్చింది. లాటరీ సొమ్ము కోసం ముందుగా కొంత కట్టాలన్న విదేశీయుల మాటలను నమ్మి అందుకోసం బ్యాంకు సొమ్ములోంచి 1.83కోట్లను చెల్లించినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News