Ram Gopal Varma: కాసేపట్లో జగన్ ను కలవనున్న రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma to meet Jagan

  • తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్న వర్మ
  • మిథున్ రెడ్డితో కలిసి జగన్ కార్యాలయానికి ఆర్జీవీ
  • జగన్ కథతో సినిమాను తెరకెక్కిస్తున్న వర్మ

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాసేపట్లో కలవనున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో కలసి క్యాంపు కార్యాలయానికి వర్మ చేసుకోనున్నారు. ముందు నుంచి కూడా వర్మ జగన్ కు, వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఆయన ట్విట్టర్ వేదికగా క్రమం తప్పకుండా విమర్శలు గుప్పిస్తుంటారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆయన గతంలో సినిమాను కూడా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగన్ కథతో సినిమాను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో జగన్ తో వర్మ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Ram Gopal Varma
Tollywood
Jagan
YSRCP
  • Loading...

More Telugu News