Chandrababu: టీడీపీ ఒరిజినల్.. పులివెందులను కొట్టి తీరుతాం: చంద్రబాబు సవాల్
- కుప్పంలో గెలవడం వైఎస్సార్ సీపీతో జరిగే పని కాదన్న చంద్రబాబు
- 98 శాతం హామీలు అమలు కాలేదు కానీ, రాష్ట్రాన్ని జగన్ 98 శాతం లూటీ చేశారని విమర్శ
- ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఏపీ పరిస్థితి నార్త్ కొరియాలా తయారవుతుందని వ్యాఖ్య
ఎవరికో పుట్టిన బిడ్డను తనకే పుట్టాడని చెప్పుకునే వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లు తానే కట్టానని జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.
విద్యుత్ వ్యవస్థను అవినీతిమయం చేసి పేదలపై భారం మోపారని, ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ప్రజల ఆదాయం తగ్గి, ధరలు పెరిగాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో భూమి విలువలు తగ్గి, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల తగ్గింపు విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
పేదలు, రైతులపై విద్యుత్ భారం తగ్గేలా నూతన విధానాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. గతంలోనూ విద్యుత్ ఉత్పత్తి ధరలను తగ్గించామన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నాశనం చేసి ఏడు సార్లు చార్జీలు పెంచేసిందని ధ్వజమెత్తారు. ఇంటి పన్ను, చెత్తపన్ను.. ఇలా అన్నింటినీ పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.