LSG pacer: కాస్త అతి అయింది.. క్షమాపణలు చెప్పిన లక్నో పేసర్

LSG pacer avesh khan apologizes for controversial gesture

  • ఇటీవలి ఐపీఎల్ లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీపై లక్నో జట్టు గెలుపు
  • ఆనందంతో హెల్మెట్ నేలకేసి కొట్టిన పేసర్ అవేశ్ ఖాన్
  • తాను అలా చేసి ఉండాల్సింది కాదన్న లక్నో బౌలర్

ఐపీఎల్ 2023 సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తీవ్ర విరోధ ఛాయలు కనిపించాయి. లక్నోలోని ఎక్నా స్టేడియంలో మే 1న ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఆటగాళ్లు గొడవ పడడం తెలిసిందే. ఏకంగా బెంగళూరు జట్టు ఆటగాడు విరాట్ కోహ్లీ, లక్నో జట్టు మెంటార్ గౌతం గంభీర్ మైదానంలో వాగ్వివాదానికి దిగారు. మైదానంలో జరిగిన తీవ్ర గొడవల్లో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుంది. 

ఆటలో భాగంగా ఆప్ఘన్ పేసర్, లక్నో జట్టు బౌలర్ నవీనుల్ హక్ విరాట్ కోహ్లీతో గొడవపడ్డాడు. ఇది మ్యాచ్ తర్వాత వాదనకు దారితీసింది. ఐపీఎల్ 2023 సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. మొదట బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగ్గా, లక్నో జట్టు గెలిచింది. పేసర్ అవేశ్ ఖాన్ బ్యాటుతో చివరి బంతికి విజయాన్ని షురూ చేసిన తర్వాత ఆనందంతో హెల్మెట్ తీసి నేలకేసి కొట్టడం గమనించొచ్చు. కానీ, అతడి చర్యను చాలా మంది విమర్శించారు. దీంతో అవేశ్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. తాను కొంచెం అతిగా స్పందించానని, నాడు అలా చేసి ఉండాల్సింది కాదని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడిన సందర్భంగా చెప్పాడు. 

‘‘ప్రజలు సోషల్ మీడియాలో నన్ను దూషించారు. హెల్మెట్ ఘటన కొంచెం ఎక్కువ అయింది. అలా చేసి ఉండాల్సింది కాదని తర్వాత అర్థం చేసుకున్నాను. ఎంతో ఉద్విగ్న సమయంలో అలా జరిగింది. ఇప్పుడు నేను అలా చేసి ఉండకూడదని అనుకుంటున్నాను’’ అని అవేశ్ ఖాన్ చెప్పాడు. అంతకుముందు రెండు సీజన్లతో పోలిస్తే 2023 సీజన్ తనకు అనుకూలంగా లేదన్నాడు అవేశ్ ఖాన్. 9 మ్యాచుల్లో అతడు కేవలం 8 వికెట్లే తీశాడు.

  • Loading...

More Telugu News