Yash: ఎవరైనా ఊహించగలరా? .. లవ్ స్టోరీలో 'కేజీఎఫ్' హీరో!

Yash in Geethu Mohandas movie

  • స్టార్ హీరోగా వెలుగుతున్న యశ్ 
  • యాక్షన్ సినిమాలకి ఆయన పేరు కేరాఫ్ అడ్రెస్ 
  • 'కేజీఎఫ్ 3' కోసం అందరూ వెయిటింగ్ 
  • గీతూ మోహన్ దాస్ కి ఓకే చెప్పిన యశ్

'కేజీఎఫ్' కి ముందు యశ్ ఏ సినిమాలు చేశాడనే విషయం పక్కన పెడితే, ఆ సినిమాతోనే ఆయనకి పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ వచ్చింది. సెకండ్ పార్టు కూడా అంతకు మించిన విజయాన్ని సాధించింది. 'కేజీఎఫ్' లో సినిమా మొదలైన దగ్గర నుంచి తుపాకుల మోత వినిపిస్తూనే ఉంటుంది. ఆ తూటాల మధ్య రాయల్ గా యశ్ నడచుకుంటూ వెళుతూనే ఉంటాడు. 

ఈ సినిమా తరువాత ప్రేక్షకులు అంతా కూడా 'కేజీఎఫ్ 3' ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే యశ్ ఈ తరహా కథలు .. ఈ తరహా పాత్రలు చేయడమే కరెక్టు అనేది వారి నమ్మకం. ఇక ఈ సినిమాలు చూసిన తరువాత సాధారణమైన ఇతర పాత్రలలో .. జోనర్లలో ఆయనను చూడటం కష్టమేనని అనుకున్నవారు లేకపోలేదు. 

ఈ నేపథ్యంలోనే తన అభిమానులను యశ్ ఆశ్చర్యచకితులను చేస్తూ, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. గీతూ మోహన్ దాస్ పేరు వినగానే, నవీన్ పౌలి హీరోగా 2019లో ఆమె రూపొందించిన 'మూతన్' అనే మలయాళ మూవీ గుర్తుకువస్తుంది. ఆమె చెప్పిన లవ్ స్టోరీ చేయడానికి యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది సమాచారం. 

Yash
Actor
Geethu Mohandas
  • Loading...

More Telugu News