Kajal Aggarwal: ఏసీపీ సత్యభామగా కాజల్

Kajal Satyabhama glimpse out

  • సత్యభామ చిత్రంలో పోలీస్ ఆఫీఫీర్ గా నటిస్తున్న కాజల్
  • దర్శకుడిగా పరిచయం అవుతున్న అఖిల్ డేగల
  • కాజల్ పుట్టిన రోజు సందర్భంగా వీడియో గ్లింప్స్ విడుదల

చందమామ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అనతికాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా మెప్పించింది. పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లి అవడంతో కొన్నాళ్లు నటనకు బ్రేక్ తీసుకున్న ఈ పంజాబీ ముద్దుగుమ్మ రీఎంట్రీలో అదరగొడుతోంది. వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పలువురు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూ మునుపటి జోరును ప్రదర్శిస్తోంది. సౌత్ సూపర్ స్టార్ కమల హాసన్‌కి జంటగా ప్యాన్ ఇండియా చిత్రం ‘ఇండియన్‌ 2’ నటిస్తున్న ఆమె  తెలుగు అగ్ర నటుడు బాలకృష్ణ సరసన ‘భగవంత్ కేసరి’లో హీరోయిన్ గా చేస్తోంది. 

అంతేకాదు ఓ ఫీమేల్ లీడ్ సినిమా కూడా చేస్తోందామె. సోమవారం కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రానికి ‘సత్యభామ’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. సినిమాలో ఆమె క్యారెక్టర్ ను చూపెట్టే ఫస్ట్ గ్లింప్స్‌ ను కూడా విడుదల చేశారు. అందులో సెల్ లో ఉన్న ఓ నిందితుడు ఎంత కొట్టినా నోరు మెదపకపోవడంతో చీర, చేతి గాజులతో వచ్చిన కాజల్ కొట్టిన దెబ్బలకు నిజం చెప్పేసే సీన్ ఆసక్తికరంగా ఉంది.

మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కాజల్ మెప్పించనుంది. ఈ సినిమాతో అఖిల్ డేగల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గూఢచారి, మేజర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాను సమర్పణలో ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
.

Kajal Aggarwal
new movie
satyabhama
police

More Telugu News