Bhagavanth Kesari: నటి కాజల్ బర్త్‌డే.. భగవంత్ కేసరి నుంచి ఫస్ట్‌లుక్ రిలీజ్

Actress Kajal Aggarwal First Look From Bhagavath Kesari
  • అనిల్ రావిపూడి-బాలయ్య కాంబినేషన్‌లో ‘భగవంత్ కేసరి’
  • శరవేగంగా షూటింగ్
  • సైకాలజీ పుస్తకం చదువుతూ కనిపించిన కాజల్
అనిల్ రావిపూడి-బాలయ్యబాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భగవంత్ కేసరి సినిమా నుంచి కాజల్ అగర్వాల్ ఫస్ట్‌లుక్ వచ్చేసింది. కాజల్ బర్త్‌డే సందర్భంగా హీరోయిన్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. చీరలో హోమ్లీగా ఉన్న కాజల్ ఓ సైకాలజీ పుస్తకం చదువుతున్నట్టుగా ఉంది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమా విశేషాలను పంచుకుంటున్న చిత్రబృందం ఇప్పటికే టైటిల్, టీజర్‌తోపాటు సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్న శ్రీలీల ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు.
Bhagavanth Kesari
Balakrishna
Anil Ravipudi
Kajal Aggarwal

More Telugu News