Preet Vikal: బ్రిటన్ లో మద్యం మత్తులో ఉన్న మహిళపై అత్యాచారానికి పాల్పడిన భారతీయ విద్యార్థికి జైలుశిక్ష

Indian student jailed for raping a drunk woman

  • గతేడాది కార్డిఫ్ నగరంలో ఘటన
  • ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న యువతి
  • మద్యం మత్తులో పబ్ వెలుపలికి వచ్చేసిన వైనం
  • ఆమె  నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని తన ఫ్లాట్ కు తీసుకెళ్లిన నిందితుడు

బ్రిటన్ లో ఓ భారతీయ విద్యార్థికి అత్యాచారం కేసులో ఆరేళ్ల జైలు శిక్ష పడింది. మద్యం మత్తులో ఉన్న యువతిపై అతడు అత్యాచారం చేసినట్టు రుజువైంది. 

ఆ విద్యార్థి పేరు ప్రీత్ వికాల్ (20). కార్డిఫ్ నగరంలో గతేడాది జూన్ 4 తెల్లవారుజామున ఓ యువతిని తన చేతులతో మోసుకుని వెళుతున్న దృశ్యాలు సిటీ సెంటర్ వెలుపల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతేకాదు, నార్త్ రోడ్ ఏరియాలో అదే యువతి ప్రీత్ వికాల్ భుజంపై వాలి ఉండగా, అతడు ఓ ఫ్లాట్ లోకి ప్రవేశిస్తుండడం కూడా సీసీ కెమెరా ఫుటేజిలో కనిపించింది. 

ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్న ఆ యువతి అధిక మోతాదులో మద్యం సేవించింది. మద్యం మత్తులో ఆమె పబ్ నుంచి బయటికి వచ్చేసింది. అయితే ఆమె మద్యం మత్తులో ఉన్న విషయాన్ని గుర్తించిన ప్రీత్ వికాల్ ఇదే అదనుగా ఆమెను తన ఫ్లాట్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. 

కార్డిఫ్ నగరంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు అని, ప్రీత్ వికాల్ వైఖరి చూస్తుంటే అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సీసీటీవీ ఫుటేజి కీలకంగా ఉపయోగపడింది. అతడు బాధితురాలికి ఇన్ స్టాగ్రామ్ లో సందేశం పంపిన విషయం కూడా వెల్లడైంది. 

కాగా, నిందితుడికి జైలు శిక్ష పడిన విషయాన్ని బాధితురాలికి పోలీసులు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ, ఆ ఘటన జరిగాక ఐదు నెలల పాటు  తాను రాత్రివేళల్లో పార్టీకి వెళ్లాలంటేనే భయపడ్డానని వెల్లడించింది.

Preet Vikal
Woman
Cardiff
Police

More Telugu News