Aadhaar: ఆధార్‌ ఉచిత అప్​ డేట్ గడువు పొడిగింపు

Aadhaar Update Deadline Extended

  • సెప్టెంబర్‌ 14 వరకు గడువు పొడిగించిన యూఐడీఏఐ
  • ఉచితంగా అప్ డేట్ కల్పించేందుకు అవకాశం
  • ఆ తర్వాత నిర్ణీత రుసుముతో అప్ డేట్ చేసుకునే వీలు

పదేళ్లు దాటిన ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకునేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గడువు పొడిగించింది. ఈమేరకు సంస్థ సీఈవో ప్రకటన విడుదల చేశారు. ఆధార్‌ ఉచితంగా అప్‌డేట్‌ చేసుకోవడం కోసం మార్చి 15 నుంచి మొదటిసారిగా అవకాశం కల్పించింది. నాలుగు నెలల పాటు ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. యూఐడీఏఐ ఇచ్చిన నాలుగు నెలల గడువు ఈనెల 14తో ముగిసింది. దాంతో, ఆధార్‌ నవీకరణ చేసుకోని వారంతా ఆందోళనకు గురయ్యారు. 

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 14 వరకు గడువు పొడిగిస్తూ యూఐడీఏఐ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ గడువు ముగిసిన అనంతరం విధిగా డబ్బులు చెల్లించి, నవీకరించుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. యూఐడీఏఐ నిబంధనల మేరకు ‘మై ఆధార్’ పోర్టల్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలో కూడా నవీకరించుకునే అవకాశాన్ని కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, చిరునామాతో పాటు తాజాగా దిగిన ఫొటోను కూడా అప్‌లోడ్‌ చేసుకునే వీలుంది.

Aadhaar
Update
Deadline
extend
UIDAI
  • Loading...

More Telugu News