Tollywood: టాలీవుడ్‌ లో విషాదం.. రచయిత అనుమానాస్పద మృతి

Writer Kirti Sagar dies under suspicious circumstances

  • వందలాది కథలు రాసిన కీర్తి సాగర్
  • ఒక్క అవకాశం రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిన రచయిత
  • ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్న పోలీసులు
  • మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ముందుకు రాని కుటుంబ సభ్యులు

టాలీవుడ్ విషాదం చోటు చేసుకుంది. సినీ కథా రచయిత కీర్తి సాగర్ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అవకాశాలు రాకపోవడంతో కుంగిపోయిన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన నేపల్లి కీర్తి సాగర్ చాలా సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి షేక్‌పేట్‌ పరిధిలో స్నేహితులతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఎన్నో కథలు రాసిన సాగర్.. అవకాశాల కోసం ప్రయత్నించాడు. సహాయ దర్శకుడిగా పని చేసేందుకు కాళ్లరిగేలా తిరిగినా ఆయనకు అవకాశం రాలేదు. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. 

ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున టెర్రస్‌పై విగతజీవిగా కనిపించాడు. ఉదయాన్నే లేచిన స్నేహితుడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీర్తి సాగర్ అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. అతని గదిలోకి వెళ్లి చూడగా.. గది నిండా తాను రాసుకున్న వందలాది కథలు కనిపించాయి. కీర్తి సాగర్ మరణవార్తను ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కానీ ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి ఎవరూ రాకపోవడంతో మార్చురీలో భద్రపరిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు.

Tollywood
writer
Kirti Sagar
suspicious death
  • Loading...

More Telugu News