Indian Railways: పూరీ జగన్నాథ్ రథయాత్రకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
- జూన్ 18వ తేదీ నుండి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లు
- సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి రైళ్ల ప్రారంభం
- ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కల్పించినట్లు అధికారుల వెల్లడి
పూరీ జగన్నాథ రథయాత్రకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఇక్కడికి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. జూన్ 18వ తేదీ నుంచి 22 మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాందేడ్ నుండి ఈ రైళ్లు ప్రారంభమవుతాయి. టిక్కెట్ రిజర్వేషన్ సదుపాయం ఇప్పటికే ప్రారంభమైందని, ఏసీ, నాన్ ఏసీ సదుపాయం కల్పించినట్లు అధికారులు తెలిపారు. అన్-రిజర్వ్డ్ ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపింది.
ఈ నెల 18న సికింద్రాబాద్ నుండి మలాటిపట్పూర్, 19న మలాటిపట్పూర్ నుండి సికింద్రాబాద్ కు, ఈ నెల 19న నాందేడ్ నుండి ఖుర్దా రోడ్, 20న ఖుర్దా రోడ్ నుండి నాందెడ్ కు, ఈ నెల 21న కాచిగూడ నుండి మలాటిపట్పూర్, 21న మలాటిపట్పూర్ నుండి కాచిగూడకు రైళ్లు నడుపుతున్నారు.