Nara Lokesh: జగన్ బ్రాండ్‌లను తరిమి కొడతాం: మద్యంపై నారా లోకేశ్

Nara Lokesh Padayatra on 129th day

  • వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయని విమర్శ
  • టీడీపీ హయాంలోనే రోడ్లు, డ్రైనేజీలు నిర్మాణం జరిగిందన్న టీడీపీ యువనేత
  • యానాదులకు పలు హామీలు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలను నియంత్రిస్తామని, అలాగే జగన్ తీసుకు వచ్చిన బ్రాండ్లను తరిమి కొడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 129వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో ఆయన మాట్లాడుతూ... వైసీపీ పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు, కరెంట్ ఛార్జీలు పెరిగాయన్నారు. పేదరికం లేని సమాజం తీసుకురావాలంటే అభివృద్ధి, సంక్షేమం అవసరమన్నారు. ప్రతి ఇంటికి నల్లాను కనెక్షన్ ఇవ్వాలనే పథకం తీసుకు వచ్చేందుకు గతంలో ఏర్పాట్లు చేశామని, ఈ లోగా ప్రభుత్వం మారిందని గుర్తు చేశారు. టీడీపీ హయాంలోనే రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ఎన్నో సంక్షేమ పథకాలను అందించినట్లు చెప్పారు.

పాదయాత్ర సందర్భంగా ఆయన యానాదులతో మాట్లాడారు. యానాదుల జీవితమంతా కష్టపడుతూనే ఉంటారని, వారి కోసం టీడీపీ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. జగన్ ప్రభుత్వం రాగానే యానాదుల సంక్షేమ పథకాలను నిలిపివేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగానే యానాదులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే ఈ ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారు. యానాదులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి ఆదుకుంటామన్నారు. కమ్యూనిటీ భవనాలు కట్టిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News