Sri Simha: సింహా హీరోగా 'భాగ్ సాలే' .. రిలీజ్ డేట్ ఖరారు!

Bhaag Saale movie update

  • శ్రీసింహా హీరోగా 'భాగ్ సాలే'
  • డిఫరెంట్ కంటెంట్ తో రూపొందిన సినిమా 
  • సంగీతాన్ని అందించిన కాలభైరవ 
  • జులై 7వ తేదీన సినిమా విడుదల

యువ హీరోల్లో ఎవరికి వారు కొత్త కాన్సెప్ట్ లకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు వెళుతున్నారు. ఈ రేసులో స్పీడ్ పెంచడానికి శ్రీసింహా ట్రై చేస్తున్నాడు. పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఒక్కో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. శ్రీసింహా హీరోగా ఇంతకుముందు 'తెల్లవారితే గురువారం' .. 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి సినిమాలు చేశాడు. 

ఇక ఇప్పుడు ఆయన తన తాజా చిత్రమైన 'భాగ్ సాలే' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. యశ్ రంగినేని .. అర్జున్ దాస్యన్ .. సింగనమల కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. గతంలో ఒకటి రెండు తెలుగు సినిమాలు చేసిన నేహా సోలంకి ఈ సినిమాలో కథానాయిక. 

తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. జులై 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు.  సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న శ్రీసింహాకి ఈ సినిమా ఆ ముచ్చట తీర్చుతుందేమో చూడాలి.

Sri Simha
Neha Solanki
Bhaag Saale Movie
  • Loading...

More Telugu News