Adipurush: బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే!

Adipurush Day 1 Box Office Collection

  • పఠాన్ వసూళ్లను దాటేసిన ప్రభాస్ సినిమా
  • తొలిరోజు రూ.80 కోట్లకు పైనే వసూళ్లు
  • మెజారిటీ వాటా తెలుగు ప్రేక్షకుల నుంచే..
  • రూ.30 కోట్లు రాబట్టిన హిందీ వెర్షన్

తొలిరోజు వసూళ్లలో ఆదిపురుష్ రికార్డులు కొల్లగొట్టింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా తొలిరోజు 80 నుంచి 82 కోట్లు రాబట్టింది. ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన షారుఖ్ ఖాన్ సినిమా పఠాన్ రికార్డును ఆదిపురుష్ చెరిపేసింది. ఆదిపురుష్ హిందీ వెర్షన్ తొలిరోజు వసూళ్లు రూ.30 కోట్లు.. మిగతా భాషల్లో రూ.50 కోట్ల వరకూ ఆర్జించిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తెలుగు వెర్షన్ కు ప్రభాస్ ఫ్యాన్స్ పట్టం కట్టారు. సినిమా తొలి రోజు వసూళ్లలో మెజారిటీ షేర్ ను తెలుగు ప్రేక్షకులే ఆర్జించి పెట్టినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా బాగాలేదన్నాడని హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమాపై హిందూ సేన కోర్టుకెక్కింది. మతపెద్దలను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించేలా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Adipurush
Prabhas
darling prabhas
first day collection
entertainment
pathan
  • Loading...

More Telugu News