Ponnam Prabhakar: దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే స్వాగతిస్తాం: పొన్నం ప్రభాకర్

We will welcome Hyderabad as second capital says Ponnam Prabhakar

  • రెండో రాజధానిగా హైదరాబాద్ అవుతుందనే నమ్మకం ఉందన్న విద్యాసాగర్ రావు
  • అన్ని పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచన
  • రెండో రాజధాని అయ్యే అన్ని లక్షణాలు హైదరాబాద్ కు ఉన్నాయన్న పొన్నం ప్రభాకర్

దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం హైదరాబాద్ కు ఉందని, సెకండ్ క్యాపిటల్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ రెండో రాజధాని కావాలనే విషయాన్ని అంబేద్కర్ కూడా చెప్పారని, రాజ్యాంగంలో ఆ విషయం ఉందని అన్నారు. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ... దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ ను చేస్తే సంతోషమేనని, దీన్ని తాము స్వాగతిస్తామని చెప్పారు. రెండో రాజధానికి కావాల్సిన అన్ని లక్షణాలు హైదరాబాద్ కు ఉన్నాయని అన్నారు. అయితే, సెకండ్ క్యాపిటల్ కావడం వల్ల హైదరాబాద్ కు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News