Non Veg Pani Puri: నయా ట్రెండ్.. నాన్ వెజ్ పానీ పూరీ!

Non Veg Pani Puri

  • నాన్ వెజ్ పానీ పూరీని అందిస్తున్న పశ్చిమబెంగాల్ స్ట్రీట్ ఫుడ్ వెండర్
  • చికెన్, మటన్, రొయ్యలు, చేపల పానీపూరీల విక్రయం
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెనూ

పిల్లలు, యువత బాగా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్స్ లో పానీపూరీ ఒకటి. రోడ్డు పక్కనున్న బండ్ల దగ్గర లొట్టలేసుకుంటూ అందరూ పానీపూరీని లాగించేస్తుంటారు. తాజాగా పశ్చిమబెంగాల్ కు చెందిన ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్ సరికొత్త పానీపూరీని ఆవిష్కరించాడు. నాన్ వెజ్ పానీపూరీని ప్రజల ముందుకు తీసుకొచ్చాడు. ఇందులో చికెన్ పానీపూరీ, మటన్ పానీ పూరీ, రొయ్యల పానీపూరీ, వేట్కీ ఫిష్ పానీపూరీ వెరైటీలు ఉన్నాయి. దీని మెనూకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సరికొత్త పానీపూరీలపై నెటిజన్లు వెరైటీగా స్పందిస్తున్నారు. వాట్ ఏన్ ఐడియా సర్జీ అంటూ పలువురు ఆహారప్రియులు ప్రశంసిస్తున్నారు.

Non Veg Pani Puri
West Bengal
  • Loading...

More Telugu News