Tamannaah: ముద్దు సీన్లలో నటించక తప్పలేదు.. కారణం ఇదే: తమన్నా

Tamanna said she is OK for kiss scenes

  • మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారానన్న తమన్నా
  • మొబైల్ ఫోన్ వల్ల అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయని వ్యాఖ్య
  • 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో ముద్దులకు ఓకే చెప్పానని వెల్లడి

తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్లలో తమన్నా ఒకరు. ఇండస్ట్రీలో ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. తొలి నుంచి కూడా తాను ఎంచుకునే పాత్రల విషయంలో కానీ, ఎక్స్ పోజింగ్ విషయంలో కానీ తమన్నా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ వచ్చింది. తోటి హీరోయిన్లు గ్లామర్ ను ఒలకబోస్తున్నప్పటికీ తాను మాత్రం పద్ధతిగానే నటించేది. ముద్దు సీన్లకు కూడా ఆమె వ్యతిరేకం. అయితే కొంత కాలంగా ఆమె తాను పెట్టుకున్న కండిషన్లకు తిలోదకాలు ఇస్తూ వస్తోంది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఇస్తోంది. 'ఎఫ్3' వంటి చిత్రాల్లో ఆమె స్కిన్ షో చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. 

అయితే తాజాగా ఆమె మాట్లాడుతూ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాను కూడా మారానని చెప్పింది. ఇప్పుడు అందరి చేతిలో మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చిందని... అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయని... ఈ నేపథ్యంలో ముద్దు సన్నివేశాలను కూడా సృజనాత్మకతలో ఒక భాగంగానే చూడాల్సి వస్తోందని తెలిపింది. అందుకే 'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్ లో ముద్దులకు ఓకే చెప్పానని వెల్లడించింది. కథ డిమాండ్ మేరకే ఈ సన్నివేశాలను చేయాల్సి వచ్చిందని చెప్పింది.

Tamannaah
Tollywood
Bollywood
Kiss Scenes
  • Loading...

More Telugu News