Nithya Menon: ఆ హీరో నన్ను చాలా ఇబ్బందిపెట్టాడు: నిత్యామీనన్

Nithya Menon Special

  • ప్రత్యేకమైన కథానాయికగా నిత్యామీనన్ కి పేరు 
  • స్కిన్ షో చేయకుండా కెరియర్ ను నెట్టుకొచ్చిన నాయిక
  • కోలీవుడ్ లో ఒక హీరో అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడి 
  • ఆ సినిమా పూర్తిచేయడం కష్టమైందని వ్యాఖ్య

తెలుగు తెరకి పరిచయమై ఇక్కడ రాణించిన బెంగుళూరు బ్యూటీలలో నిత్యామీనన్ ఒకరు. అందువలన ఆమె కన్నడ సినిమాలు ఎక్కువగా చేసి ఉండొచ్చునని అనుకుంటారు. కానీ నిజానికి ఆమె కన్నడలో చేసిన సినిమాలు చాలా తక్కువ. తెలుగు ... తమిళ .. మలయాళ భాషల్లో చేసినవి ఎక్కువ. తెలుగు నుంచి చాలా సూపర్ హిట్లు ఆమె ఖాతాలో ఉన్నాయి. 

స్కిన్ షో చేయకుండా స్టార్ డమ్ సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో ఆమె ఒకరు. సాయిపల్లవి కంటే ముందుగా ఇక్కడ నటన పరంగా వినిపించిన పేరు నిత్యామీననే. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ చెప్పిన ఒక మాట ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.  

నిత్య మాట్లాడుతూ .. "తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నన్ను అందరూ కూడా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. నాకు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. కానీ ఒక తమిళ హీరో మాత్రం పదే పదే నన్ను అసభ్యంగా తాకుతూ ఇబ్బందిపెట్టేవాడు. అతని చేష్టల కారణంగా ఆ సినిమాను పూర్తిచేయడం కష్టమైపోయింది" అని చెప్పుకొచ్చింది. 

Nithya Menon
Actress
Tollywood
  • Loading...

More Telugu News