Atreyapuram putharekulu: భౌగోళిక గుర్తింపు దక్కించుకున్న ఆత్రేయపురం పూతరేకులు

Atreyapuram putharekulu Got GI Tag

  • భౌగోళిక గుర్తింపు కోసం పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు
  • అభ్యంతరాలు కోరుతూ కేంద్రం నోటిఫికేషన్
  • ఈ నెల 13న అర్ధరాత్రితో ముగిసిన గడువు
  • జీఐ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులకు చోటు

ఆత్రేయపురం పూతరేకు.. పరిచయం అక్కర్లేని పేరిది. రుచిలో రారాజు అయిన ఈ పూతరేకులకు దేశవిదేశాల్లో మంచి పేరుతోపాటు డిమాండ్ కూడా ఉంది. ఇప్పుడు వీటికి భౌగోళిక గుర్తింపు లభించింది. పూతరేకులకు భౌగోళిక గుర్తింపు (జీఐ) కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థన్ కాటన్ పూతరేకుల సహకార సంఘం దరఖాస్తు చేసింది.

ఫిబ్రవరి 13న కేంద్రం విడుదల చేసిన జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) జర్నల్‌లో ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై ప్రకటన ఇస్తూ అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 13 వరకు గడువు ఇచ్చింది. ఆ రోజు అర్ధరాత్రితో గడువు ముగిసినప్పటికీ ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీలో పూతరేకులు నమోదయ్యాయి. వాటికి భౌగోళిక గుర్తింపు లభించినట్టు సర్ అర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం తెలిపింది.

Atreyapuram putharekulu
Dr BR Ambedkar Konaseema District
GI
Andhra Pradesh
  • Loading...

More Telugu News