Rishabh Pant: ఎవరి సాయం లేకుండానే బిల్డింగ్ మెట్లు ఎక్కిన రిషబ్ పంత్
- గత ఏడాది డిసెంబర్ లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్
- వీడియోను ఇన్ స్టాలో షేర్ చేసిన క్రికెటర్!
- రిషబ్ సొంతగా నడవడంపై నెటిజన్ల హర్షం
గత ఏడాది చివరలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. చేతి కర్ర, ఇతరుల సాయం లేకుండానే నడవగలుగుతున్నాడు. ఎవరి సాయం లేకుండానే మెట్లు ఎక్కిన ఓ వీడియోను రిషబ్ తన ఇన్‌స్టా లో షేర్ చేశాడు.
గత ఏడాది డిసెంబర్ లో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ పంత్ క్రమంగా కోలుకుంటున్నాడు. రిషబ్ పంత్ సొంతంగా నడవడంపై నెటిజన్లు ఆనందంగా స్పందిస్తున్నారు.