Rajnath Singh: బిపర్‌జోయ్ తుపాను: తొమ్మిది నగరాలు పూర్తిగా బంద్!
- తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- 34,000కు పైగా పౌరుల తరలింపు
- రేపు ద్వారకాదీశ్ ఆలయం మూసివేత
- ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లతో రాజ్ నాథ్ సమీక్ష
బిపర్‌జోయ్ తుపాను నేపథ్యంలో గుజరాత్ లో తీర ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక కచ్ జిల్లాలోనే 34,000కు పైగా ప్రజలను తరలించారు. వీరికి బీఎస్ఎఫ్ జవాన్లు షెల్టర్ లను నిర్మించారు. ఇక్కడి తొమ్మిది నగరాలను పూర్తిగా మూసివేశారు. సౌరాష్ట్ర - కచ్ సహా వివిధ తీర ప్రాంతాల్లో తీవ్ర గాలులతో భారీ వర్షం కురుస్తోంది. రేపు ద్వారకలోని ద్వారకాదీశ్ అలయాన్ని మూసివేస్తున్నారు. మరోవైపు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బుధవారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్ లతో సమీక్షించారు.