Prabhas: 'ఆదిపురుష్' సినిమాను ప్రభాస్ అక్కడే చూస్తాడట!

Adipurush movie update

  • ఈ నెల 16న 'ఆదిపురుష్' విడుదల 
  • అమాంతంగా పెరిగిన అంచనాలు 
  • యూఎస్ లో ప్రభాస్ ఈ సినిమా చూస్తాడని టాక్ 
  • సంచలనానికి తెరతీయడం ఖాయమంటున్న ఫ్యాన్స్ 

ప్రభాస్ కథానాయకుడిగా 'ఆదిపురుష్' సినిమా రూపొందింది. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి, ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దాంతో ఈ సినిమా కోసం అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. 

ప్రీ రిలీజ్ ఈవెంట్ తరువాత ప్రభాస్ వరుస ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ వెళతాడని అంతా అనుకున్నారు. కానీ ఆల్రెడీ వచ్చేసిన హైప్ కారణంగా ఇక ప్రమోషన్స్ అవసరం లేదని భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక భక్తి రసాత్మక చిత్రంగా ఇది అంచనాలు పెంచుతూ వెళుతోంది. అందువల్లనే ప్రమోషన్స్ హడావిడి కనిపించడం లేదు. 

ఇక ఆల్రెడీ ప్రభాస్ యూఎస్ వెళ్లిపోయాడని అంటున్నారు. ఈ సినిమాను ఆయన అక్కడే చూస్తాడని చెబుతున్నారు. ఈ సినిమా బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉంటే, సంచలనానికి తెరతీయడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

Prabhas
Krithi Sanon
Sunny Singh
Devdatta
Adipurush
  • Loading...

More Telugu News