Chiranjeevi: హాయ్ చరణ్ అండ్ ఉప్సీ: చిరంజీవి శుభాకాంక్షలు

Hi Charan and Upsy greets Chiranjeevi

  • ఈరోజు చరణ్, ఉపాసనల 11వ వెడ్డింగ్ యానివర్సరీ
  • మీరిద్దరూ మేము ఎంతో గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేశారన్న చిరంజీవి
  • 2012 జూన్ 14న జరిగిన చెర్రీ, ఉపాసనల వివాహం

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసనల పెళ్లిరోజు నేడు. ఈ అన్యోన్యమైన జంట ఈరోజు 11వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ దంపతులకు మరికొన్ని రోజుల్లో బిడ్డ జన్మించబోతున్న నేపథ్యంలో ఈ వెడ్డింగ్ యానివర్సరీ వీరికి మరెంతో ప్రత్యేకంగా మారింది. మరోవైపు వివాహ వార్షికోత్సవం సందర్భంగా చరణ్ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడు చరణ్, కోడలు ఉపాసనలకు గ్రీటింగ్స్ తెలియజేశారు. 

"హాయ్ చరణ్ అండ్ ఉప్సీ... ప్రత్యేకమైన ఈరోజున మీ ఇద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరిద్దరూ మేము ఎంతో గర్వపడేలా, సంతోషంగా ఉండేలా చేశారు. మీరిద్దరూ తల్లిదండ్రులుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్. మీ బిడ్డపై మీకుండే ప్రేమ ఇతరులు కూడా చెప్పుకునే విధంగా ఉండాలి. లవ్ అండ్ బ్లెస్సింగ్స్... అమ్మ, నాన్న" అని చిరంజీవి ట్వీట్ చేశారు. 

చరణ్, ఉపాసన ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2011 డిసెంబర్ లో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. 2012 జూన్ 14న వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

Chiranjeevi
Ramcharan
Upasana
Wedding Anniversary

More Telugu News