Baby: జులై 14న వస్తున్న ఆనంద్ దేవరకొండ ‘బేబీ’

Baby The Movie in Theatres this July 14th

  • ప్రధాన పాత్రల్లో విరాజ్, వైష్ణవి చైతన్య 
  • సాయి రాజేష్ దర్శకత్వం వహించిన చిత్రం
  • ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సినిమా

విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చిన యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ. వచ్చినప్పటి నుంచీ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఆనంద్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు.

సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్న సినిమాను మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌‌పై ఎస్.కె.ఎన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే టీజర్‌‌తో పాటు మూడు పాటలను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. జులై 14న ఇది విడుదల అవుతుందని తెలిపింది. త్వరలోనే నాలుగో పాటను విడుదల చేస్తామని వెల్లడించారు.

More Telugu News