London: లండన్ లో తెలుగు విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన బ్రెజిల్ యువకుడు

Telugu girl student killed in London

  • యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్న తేజస్విని
  • ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో తెలుగు అమ్మాయి
  • మృతురాలిది హైదరాబాద్ లోని చంపాపేట్

లండన్ లో విద్యను అభ్యసిస్తున్న తేజస్విని రెడ్డి అనే యువతి దారుణ హత్యకు గురయింది. బ్రెజిల్ కు చెందిన యువకుడు ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన తేజస్విని అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మరో తెలుగు అమ్మాయి అఖిల తీవ్రంగా గాయపడింది. 

హైదరాబాద్ చంపాపేట్ కు చెందిన తేజస్విని ఉన్నత విద్యాభ్యాసం కోసం లండన్ కు వెళ్లింది. తేజస్విని, అఖిల ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్నారు. వీరిద్దరిపై దాడి చేసిన ఉన్మాది 50 ఏళ్ల మరో వ్యక్తిని కూడా పొడిచి చంపేశాడు. హంతకుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు తేజస్విని మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి రప్పించాలని ఆమె కుటుంబసభ్యులు కోరుతున్నారు.

London
Telugu
Lady
Student
Murder
  • Loading...

More Telugu News