Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూ మూవీ లాంచ్

Vijay Devarakonda New Movie Launched

  • యూత్ ఇప్పటికీ మరిచిపోని 'గీత గోవిందం'
  • మళ్లీ ఇంతకాలానికి సెట్ అయిన అదే కాంబినేషన్
  • దిల్ రాజు బ్యానర్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 
  • కథానాయికగా ఛాన్స్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్

విజయ్ దేవరకొండ - పరశురామ్ - దిల్ రాజు కాంబినేషన్ లో ఒక ప్రాజెక్టు పట్టాలెక్కనుందనే విషయం రెండు మూడు రోజులుగా షికారు చేస్తోంది. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించనుందనే టాక్ కూడా గట్టిగానే వినిపించింది. అనుకున్నట్టుగానే ఆ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు. హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. హీరో హీరోయిన్లపై నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ ఇవ్వడంతో లాంఛనంగా షూటింగు మొదలైంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' తరువాత విజయ్ దేవరకొండ - పరశురామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 'గీత గోవిందం' ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో మంచి రేటింగును నమోదు చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా కోసం ఎప్పటి నుంచో  ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అది ఇప్పటికి కుదిరిందన్న మాట. నాని జోడీగా ఒక సినిమా చేస్తున్న మృణాల్ ఠాకూర్, హఠాత్తుగా విజయ్ దేవరకొండ సరసన మెరవడం విశేషం. 

Vijay Devarakonda
Mrunal Thakur
Dil Raju
Parashuram
  • Loading...

More Telugu News