Prabhas: శ్రీరాముడిగా ప్రభాస్ ఎలా మెప్పిస్తాడనేదే ఇప్పుడు హాట్ టాపిక్!

Prabhas Special

  • శ్రీరాముడి పాత్రకి వైభవాన్ని తెచ్చిన ఎన్టీఆర్ 
  • ఆ తరువాత ఆ పాత్రలో కనిపించిన హరనాథ్, శోభన్ బాబు 
  • బాపు దర్శకత్వంలో మెప్పించిన బాలకృష్ణ
  • ఈ జనరేషన్ ప్రేక్షకుల ముందుకు రాముడిగా వస్తున్న ప్రభాస్   

తెలుగుకి సంబంధించి వెండితెరపై శ్రీరాముడిగా ఇంతవరకూ కొంతమంది కథానాయకులు మాత్రమే కనిపించారు. శ్రీరాముడు అనగానే నిండైన విగ్రహం .. ప్రశాంతమైన వదనం .. చెదరని చిరునవ్వు .. నిర్మలమైన మాట తీరు ... రాజసం ఉట్టిపడే నడక .. నిలువెత్తు నిబ్బరం .. ఇలా ఎన్నో లక్షణాలు ఆయనకి సహజమైన ఆభరణాలుగా కనిపిస్తాయి.

ఎన్టీ రామారావుకంటే ముందుగా ఒకరిద్దరు శ్రీరాముడి పాత్రలను పోషించినా, ఆ పాత్రకి ఆయన తీసుకొచ్చిన వైభవం వేరు. అసలు ఎన్టీఆర్ తరువాత శ్రీరాముడి పాత్రలో కనిపించడానికే ఎవరూ సాహసించలేదు. ఆయనను కాకుండా మరొకరిని రాముడిగా చూడటానికి జనం పెద్దగా ఆసక్తిని చూపించలేదు.

శ్రీరాముడిగా కనిపించే అవకాశం హరనాథ్ కి ఎన్టీఆర్ ఇస్తే, ఆ పాత్రను పోషించే అవకాశం శోభన్ బాబుకి  .. బాలకృష్ణకి బాపు ఇచ్చారు. ఇలా ఆ పాత్రలో చాలా కొద్దిమంది మాత్రమే కనిపించారు. అలాంటి పాత్రలో ఇప్పుడు ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ జనరేషన్ కి శ్రీరాముడిగా కనిపిస్తున్నది ప్రభాస్ మాత్రమే. పౌరాణిక చిత్రంలో నటించడం ఇదే ఆయనకి మొదటిసారి. అందువలన ఈ పాత్రలో ఆయన ఏ స్థాయిలో మెప్పిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. 

Prabhas
Krithi Sanon
Om Raut
Adipurush Movie
  • Loading...

More Telugu News