Kotha Prabhakar Reddy: బీఆర్ఎస్ ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలపై ఐటీ దాడులు.. ఐటీ అధికారులకు కేంద్ర బలగాల భద్రత!

IT raids on BRS MP and two MLAs

  • ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డిలపై ఐటీ దాడులు
  • తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్న 50 బృందాలు
  • ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భారీ భద్రత

బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఈ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కు చెందిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 50 ఐటీ బృందాలు ఈ సోదాల్లో పాల్గొంటున్నాయి. 

కొండాపూర్ లోని లుంబిని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్ లోని కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో తెల్లవారుజాము నుంచే సోదాలు జరుగుతున్నాయి. ఆయన కార్యాలయాలపై కూడా ఏక కాలంలో దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లిన ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలతో పాటు నగరంలోని వివిధ రియలెస్టేట్ సంస్థల కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ లో కూడా రెయిడ్స్ జరుగుతున్నాయి. 

కేంద్ర బలగాల భద్రత మధ్య ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ నేతలపై ఐటీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో... సోదాలు జరుగుతున్న ప్రాంతాలు, హైదరాబాద్ లోని ఐటీ కార్యాలయం వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Kotha Prabhakar Reddy
Pailla Shekar Reddy
Marri Janardhan Reddy
BRS
IT Raids
  • Loading...

More Telugu News