BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు.. సోదాలు నిర్వహిస్తున్న 30 బృందాలు

IT raids on BRS MLA Pailla Shekar Reddy

  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు
  • ఉదయం నుంచి 12 చోట్ల తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు
  • ఐటీ దాడులతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఆయన నివాసం, భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలనీలోని కార్యాలయాలతో పాటు 12 చోట్ల ఈ ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ లిమిటెడ్, హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ లో సోదాలు జరుగుతున్నాయి. ఈ రెండు కంపెనీలకు శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్ గా ఉన్నారు. 

దాదాపు 30 బృందాలు ఐటీ సోదాలను నిర్వహిస్తున్నాయి. కంపెనీల లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల వివరాలను వీరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేంద్ర బలగాల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. ఈ ఐటీ దాడులతో బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.

More Telugu News