Pawan Kalyan: తన యాత్రకు నామకరణం చేసిన పవన్ కల్యాణ్... పేరు ఇదే!

Pawan Kalyan named his yatra

  • జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ యాత్ర
  • 'జనసేన వారాహి విజయ యాత్ర'గా నామకరణం
  • రేపు అన్నవరం సత్యదేవుని దర్శించుకోనున్న పవన్ కల్యాణ్

జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. కాగా, పవన్ కల్యాణ్ తన యాత్రకు నేడు నామకరణం చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనంలో తాను చేస్తున్న యాత్రకు 'జనసేన వారాహి విజయ యాత్ర' అని పేరు పెట్టారు. రేపు అన్నవరం సత్యదేవుని దర్శనం అనంతరం పవన్ రాజకీయ యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. 

పవన్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ ఇప్పటికే విడుదల చేసింది. పలు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. 

కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ప్రత్యేక అంబులెన్స్ ను కూడా తీసుకువస్తున్నారు. దీనిపేరు జన హిత. ఇందులో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News