AP High Court: ఎంపీ రఘురామకృష్ణరాజు మెడికల్ రిపోర్ట్స్‌‌ను భద్రపరచాలని హైకోర్టు ఆదేశం

AP high court on MP Raghurama medical reports
  • సీఐడీ కోర్టు ఆదేశాలతో రెండేళ్ల క్రితం జీజీహెచ్ లో జరిగిన వైద్య పరీక్షలు
  • ఈ నివేదికలను ధ్వంసం చేయడానికి అనుమతి కోరిన అధికారులు
  • ఈ నేపథ్యంలో తన వైద్య పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని కోర్టుకెక్కిన ఎంపీ
నరసాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను భద్రపరచాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సీఐడీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల నివేదికలను భద్రపరచాలని రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామ తరఫున వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.

కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ను భద్రపరచాలని కోరారు. రెండేళ్లు పూర్తి కావడంతో ఈ నివేదికలను ధ్వంసం చేయడానికి అధికారులు ప్రభుత్వ అనుమతి కోరినట్లు రఘురామ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కు సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.
AP High Court
Raghu Rama Krishna Raju

More Telugu News