Mahesh Babu: మహేశ్ మూవీకి రాజమౌళి పెట్టిన ముహూర్తం అదేనట!

Rajamouli and Mahesh Babu Movie Update

  • 'గుంటూరు కారం' షూటింగులో బిజీగా మహేశ్
  • వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న సినిమా 
  • తరువాత సినిమా రాజమౌళి దర్శకత్వంలో 
  • కథపై జరుగుతున్న కసరత్తు
  • మహేశ్ బర్త్ డేకి పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచన

మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి 'గుంటూరు కారం' అనే టైటిల్ ను ఇటీవలే ఖరారు చేశారు. టైటిల్ కి మహేశ్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. 

ఈ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో మహేశ్ మూవీ ఉండనుందనే సంగతి తెలిసిందే. 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లిన రాజమౌళి, ఇక మహేశ్ మూవీపైనే పూర్తి దృష్టిపెట్టినట్టుగా చెబుతున్నారు. విజయేంద్రప్రసాద్ టీమ్ తో కలిసి కథపై ఒక రేంజ్ లో కసరత్తు జరుగుతున్నట్టుగా సమాచారం.

ఈ సినిమా బౌండ్ స్క్రిప్ట్ రెడీ కావడానికీ .. ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం ఉంది. బహుశా వచ్చే ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కొచ్చు. అయితే ఆగస్టు 9వ తేదీన మహేశ్ బాబు బర్త్ డే కావడంతో, ఆ రోజున లాంఛనంగా ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. తన కొత్త సినిమాల ఓపెనింగ్స్ కి వచ్చే అలవాటు లేని మహేశ్, రాజమౌళి సినిమా ఓపెనింగ్ కి మాత్రం వచ్చే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది. 

Mahesh Babu
Pooja Hegde
Rajamouli
  • Loading...

More Telugu News