Kazan Khan: సినీ పరిశ్రమలో విషాదం.. వెటరన్ విలన్ కజాన్ ఖాన్ కన్నుమూత

Veteran actor Kazan Khan passes away due to heart attack
  • గుండెపోటుతో మృతి చెందిన కజాన్ ఖాన్
  • విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న
  • బద్రీ, భద్రాచలం సినిమాలతో తెలుగులో గుర్తింపు
సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నిన్నటి తరం ప్రముఖ నటుడు కజాన్ ఖాన్ నిన్న రాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత ఎన్ఎమ్ బదూష సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలతో కజాన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేరళకు చెందిన కజాన్ 1992లో సెంతమిళ్ పట్టు (తెలుగులో అమ్మకొడుకు) అనే చిత్రంతో ఆయన తెరంగేట్రం చేశారు. 

గంధర్వం, సీఐడీ ద మూస, ద కింగ్, వర‍్ణపకిత్, డ్రీమ్స్, మాయమోహిని, రాజాధిరాజా లాంటి మలయాళ సినిమాల్లో నటించారు.  మొత్తంగా 50కి పైగా చిత్రాలు చేశారు. తెలుగులో పవన్ కల్యాణ్ బద్రీ చిత్రం, దివంగత శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం చిత్రాల్లో విలన్ గా నటించి తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 2015లో వచ్చిన 'లైలా ఓ లైలా' చిత్రంలో వెండి తెరపై కనిపించారు. కజాన్ ఖాన్ మరణం పట్ల చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Kazan Khan
actor
heart attack
passes away
Pawan Kalyan
srihari

More Telugu News