Tamannah: తమన్నా వెబ్ సిరీస్ 'జీ కర్దా' కథేమిటి? .. ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్!

Jee karda Web Series Update

  • అమెజాన్ ప్రైమ్ లో 'జీ కర్దా' 
  • తమన్నా ప్రధాన పాత్రధారిగా కనిపించనున్న వెబ్ సిరీస్ 
  • ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్  
  • ఏడుగురు స్నేహితుల జీవితాల చుట్టూ అల్లుకున్న కథ
  • లవ్ .. రొమాన్స్ కి కూడా చోటు

తమన్నాకి తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను మంచి క్రేజ్ ఉంది. ఒక వైపున సినిమాలను చక్కబెడుతూనే, మరో వైపున వెబ్ సిరీస్ లను లైన్లో పెట్టేస్తోంది. బాలీవుడ్ లో ఆమె చేసిన ఫస్టు వెబ్ సిరీస్ గా 'జీ కర్దా' రూపొందింది. అరుణిమ శర్మ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. 

తమన్నా ప్రధాన పాత్రగా నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కథేమిటి? ఏ లైన్ పై ఈ కథ నడుస్తుంది? అనే ఆసక్తి ఆమె అభిమానులలో తలెత్తడం సహజం. ఈ కథలో తమన్నాకి ఆరుగురు ఫ్రెండ్స్ ఉంటారు. అందరి మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉంటుంది. తమకి 30 ఏళ్లు వచ్చేసరికి లైఫ్ లో సెటిలైపోవాలనే ఒక బలమైన నిర్ణయాన్ని వాళ్లంతా కలిసి తీసుకుంటారు. 

అందరూ కూడా ఆ గోల్ ను రీచ్ కావడానికే ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ క్రమంలో వాళ్లు ఎలాంటి తప్పు చేస్తారు? అందువలన వాళ్లంతా ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేస్తారు? అనేదే కథ.  ఫ్రెండ్షిప్ తో పాటు లవ్ .. రొమాన్స్ కూడా ఈ కథలో భాగమై ఉన్నాయి. ఆషిమ్ గులాటి .. సోహెయిల్ నయ్యర్ .. అన్యా సింగ్ .. నయన్ బెనర్జీ తదితరులు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 

Tamannah
Ashim Gulati
Anya Singh
Nayan Benarji
  • Loading...

More Telugu News