Raviteja: రవితేజ 73వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్ .. పోస్టర్ రిలీజ్!

Raviteja New Movie Title Confirmed

  • మొదటి నుంచి దూకుడు చూపిస్తున్న రవితేజ 
  • ఫ్లాపులు ప్రభావితం చేయలేని కెరియర్ 
  • ప్రస్తుతం సెట్స్ పై ఉన్న 'టైగర్ నాగేశ్వరరావు'
  • ఆ తరువాత సినిమా కార్తీక్ ఘట్టమనేనితో
  • ఈ సినిమా టైటిల్ గా 'ఈగల్' ఖరారు

మొదటి నుంచి కూడా రవితేజ తన కెరియర్ విషయంలో మంచి దూకుడు చూపిస్తూ వచ్చాడు. హిట్ .. ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఫ్లాపులు ఆయన కెరియర్ పై ప్రభావం చూపించిన సందర్భాలు ఎప్పుడూ లేవు. ఇటీవల 'ధమాకా' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న ఆయన, 'రావణాసుర'తో ఫ్లాప్ అందుకోక తప్పలేదు. 

ఇక ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'టైగర్ నాగేశ్వరరావు' రెడీ అవుతోంది. ఇదే పేరుతో ఒకప్పుడు గజగజలాడించిన ఒక స్టూవర్టుపురం గజదొంగ కథ ఇది. ఈ అక్టోబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా చూసుకుంటే రవితేజకి ఇది 73వ సినిమా.

 కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. కొంతసేపటి క్రితమే ఈ సినిమాకి 'ఈగల్' అనే టైటిల్ ను ఖాయం చేస్తూ, రవితేజ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఎటు చూసినా గన్స్ .. వాటి మధ్యలో గన్ పట్టుకుని ఏదో ఆలోచన చేస్తున్న రవితేజ. విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన కనిపిస్తున్నాడు. టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని రేకెత్తించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

Raviteja
Karthik Ghattamaneni
People Media Factory
  • Loading...

More Telugu News