Payal: పాయల్ మూవీ నుంచి బ్యాచిలర్ పార్టీ సాంగ్!

Mayapetika movie song released

  • రమేశ్ దర్శకత్వంలో రూపొందిన 'మయా పేటిక'
  • ఒక సెల్ ఫోన్ చుట్టూ తిరిగే ఆసక్తికరమైన కథ 
  • ప్రధానమైన పాత్రల్లో పాయల్ .. సునీల్ .. రజిత్ రాఘవ
  • ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల

ఈ మధ్య కాలంలో కాన్సెప్ట్ బేస్డ్ కథలకు ఆదరణ పెరుగుతూ పోతోంది. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'మాయా పేటిక'. శరత్ చంద్రారెడ్డి - తారక్ నాథ్ నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ దర్శకత్వం వహించాడు. పాయల్ రాజ్ పుత్ .. సిమ్రత్ కౌర్  .. సునీల్ .. రంజిత్ రాఘవన్ ప్రధానమైన పాత్రలను పోషించారు . 

ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇది బ్యాచ్ లర్ పార్టీ సాంగ్. 'సాయానోరా .. ' అంటూ ఈ పాట సాగుతోంది. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో పాయల్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు.

గుణ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, హారిక నారాయణ్ ఆలపించారు. ఈ కథలో ఒక సెల్ ఫోన్ అనుకోకుండా చేతులు మారుతూ, ఒకరి నుంచి మరొకరి దగ్గరికి వెళుతుంటుంది. ఎవరి చేతికి ఆ సెల్ ఫోన్ చేరితే వాళ్లు అనూహ్యమైన పరిణామాలను ఎదుర్కుంటూ ఉంటారు. అందుకు కారణం ఏమిటి? అనేదే కథ.

More Telugu News