: కేసీఆర్, కోదండరాంలకు కోర్టు నోటీసులు
భారత రాజ్యాంగాన్ని కించపరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాంలకు విశాఖపట్నం కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న వీరిద్దరూ వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని విశాఖ రెండో అదనపు సివిల్ కోర్టు ఆదేశించింది. ప్రధాని మన్మోహన్ సింగ్ తోపాటు భారత దేశంపై కూడా కేసీఆర్, కోదండరాం అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ విశాఖలో కేసు నమోదయిన సంగతి విదితమే.