Roja: చివరికి ఇలా ఫేక్ ప్రచారానికి దిగారా?: టీడీపీకి మంత్రి రోజా కౌంటర్

Roja reacts to TDP criticism

  • ఏపీ మంత్రులను టార్గెట్ చేసిన చంద్రబాబు
  • టీడీపీ ట్వీట్ ను తప్పుబట్టిన మంత్రి రోజా
  • టీడీపీ హయాంలో టూరిజం శాఖ గురించి ప్రజలకి తెలిసేదే కాదని వెల్లడి

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ మంత్రులను టార్గెట్ చేయడంపై రాష్ట్ర టూరిజం మంత్రి రోజా స్పందించారు. జగన్ ఇచ్చిన పదవులను ప్రజల కోసం కాకుండా జగన్ కోసం, తమ స్వార్థం కోసం మంత్రులు దుర్వినియోగం చేస్తున్నారని, అందుకే చంద్రబాబు ఈ రేంజ్ లో తగులుకున్నారని టీడీపీ పేర్కొంది. దీన్ని మంత్రి రోజా తప్పుబట్టారు. మీ టీడీపీ వాళ్లందరూ చివరికి ఇలా ఫేక్ ప్రచారానికి దిగారా? అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. 

"అసలు మీ చంద్రబాబు ప్రభుత్వంలో టూరిజం శాఖ ఒకటి ఉండేదని కానీ, టూరిజం మంత్రి ఉండేవారని కానీ ప్రజలకు తెలియనట్టు ఉండేది. కానీ మా సీఎం జగన్ ప్రభుత్వంలో ఏపీని టూరిజం హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నాం. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో టూరిజం రంగంలో రూ.22,096 కోట్ల విలువైన 117 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే, ఏపీలో టెంపుల్ టూరిజం వంటి నూతన విధానాలు ప్రవేశపెడుతున్నాం. చారిత్రక స్థలాలను టూరిజం కేంద్రాలుగా మార్చుతున్నాం" అని రోజా స్పష్టం చేశారు.

Roja
Minister
Tourism
YSRCP
Chandrababu
TDP
Andhra Pradesh
  • Loading...

More Telugu News