Harish Rao: ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్క బోర్లా పడింది: హరీశ్ రావు

Harish Rao comments on AP leaders

  • మరోసారి ఏపీ రాజకీయాలపై హరీశ్ కామెంట్లు
  • ఒక నాయకుడు హైటెక్ అంటూ ఊదరగొట్టాడని ఎద్దేవా
  • రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని వ్యాఖ్య

తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి ఏపీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు నేతల వల్ల ఏపీ బొక్కబోర్లా పడిందని ఆయన అన్నారు. గతంలో ఒక నాయకుడు హైటెక్ అంటూ ఊదరగొట్టాడని ఎద్దేవా చేశారు. ఏపీ వాళ్లది ప్రచారం ఎక్కువగా ఉంటుందని, మనది పని ఎక్కువగా ఉంటుందని చెప్పారు. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ లకు వెళ్లి చూస్తే తెలంగాణ గొప్పదనం ఏమిటో తెలుస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా కేసీఆర్ చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పథకాలను కాపీ కొడుతోందని విమర్శించారు. కేంద్ర ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలను తెలంగాణ ఉద్యోగులు పొందుతున్నారని చెప్పారు.   

తెలంగాణకు రావాల్సిన రూ. 1.30 లక్షల కోట్లను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందని హరీశ్ మండిపడ్డారు. ధరణి వల్లే రైతుల సమస్య పరిష్కారం అయిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ దళారీ వ్యవస్థ రాజ్యమేలుతుందని అన్నారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలవాలంటే కేసీఆర్ మూడోసారి రావాలని చెప్పారు.

Harish Rao
KCR
TRS
Andhra Pradesh
  • Loading...

More Telugu News