Balakrishna: ఒక రోగి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే.. నాకు పండుగలా ఉంటుంది: బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
- చిన్నారులకు కేక్ తినిపించి.. కానుకల్ని పంపిణీ చేసిన బాలయ్య
- బసవతారకం ఆసుపత్రికి చైర్మన్‌గా ఉండటం పూర్వజన్మ సుకృతమని వ్యాఖ్య
మన ఆలోచనలకు మన శరీరాన్ని బానిసగా చేసుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా సమాజానికి సేవ చేయవచ్చని సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. మన జీవితానికి మనమే నిర్దేశకులమని చెప్పారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో బాలకృష్ణ జన్మదిన వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన భారీ కేక్ ను కట్ చేశారు. చిన్నారులకు కేక్ తినిపించి.. కానుకల్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్‌గా ఉండటం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. ఇది దేశంలో రెండో బెస్ట్ క్యాన్సర్ ఆసుపత్రిగా ఓ సర్వేలో నిలిచిందని అన్నారు. ఆసుపత్రి నుంచి ఒక రోగి డిశ్చార్జ్ అయ్యి వెళ్తుంటే.. తనకు పండుగలా ఉంటుందని ఆయన అన్నారు.