Chiranjeevi: మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట: వరుణ్ తేజ్, లావణ్యలకు చిరంజీవి శుభాకాంక్షలు

Chiranjeevi blessings to Varun Tej and Lavanya Tripati

  • ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్
  • వేడుకకు హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
  • మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించిన చిరంజీవి

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలయింది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ నిన్న హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరై కాబోయే జీవిత భాగస్వాములను ఆశీర్వదించారు. మరోవైపు పెదనాన్న చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో లావణ్యకు వరుణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ తొడిగాడు. 

మరోవైపు వరుణ్, లావణ్య జంటకు చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. 'వరుణ్ తేజ్, లావణ్యలకు ఎంగేజ్ మెంట్ శుభాకాంక్షలు. మీ ఇద్దరిదీ ఒక అందమైన జంట. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా ఉండాలి. మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి' అని ట్వీట్ చేశారు. 

Chiranjeevi
Varun Tej
Lavanya Tripati
Engagement
Tollywood
  • Loading...

More Telugu News