Man: స్టార్ బక్స్ లో కూర్చుని రూ.400 కాఫీని రూ.190కి తెప్పించుకున్నాడు.. ఎలాగంటే..!

Man orders Starbucks coffee worth Rs 400 for Rs 190 from Zomato while sitting inside the coffee shop

  • జొమాటో, స్విగ్గీల్లో తరచుగా ఆఫర్లు
  • వాటి ద్వారా బుక్ చేసుకుంటే తక్కువకే సొంతం
  • ఓ వ్యక్తి ఇలా చేసే సగం ధరకు తెప్పించుకున్న వైనం

యుక్తి ఉంటే చాలు భుక్తికి ఢోకా ఉండదని నిరూపించాడు ఓ యువకుడు. తనకు కావాల్సిన పానీయాన్ని సగం రేటుకే అదే రెస్టారెంట్ లో కూర్చుని తెప్పించుకున్నాడు. స్టార్ బక్స్ తెలిసే ఉంటుంది. టాటాలకు చెందిన ఈ కాఫీ రెస్టారెంట్ లో.. కాఫీ తాగితే ఆ రుచిని ఎప్పటికీ మరిచిపోరు. అక్కడ కప్పు కాఫీ తాగాలంటే కనీసం రూ.300-400 అయినా ఖర్చు చేయాల్సిందే. అందరూ ఇంత ధర పెట్టుకోలేకపోవచ్చు. అయినా సరే తక్కువ ధరకు అదే స్టార్ బక్స్ కాఫీ తాగాలంటే ఏం చేయాలో సందీప్ మాల్ అనే వ్యక్తి తెలియజేశాడు.

స్టార్ బాక్స్ రెస్టారెంట్ కు వెళ్లి కూర్చున్నాడు. జొమాటో, స్వీగ్గీలో అప్పుడప్పుడు ఆఫర్లు వస్తుంటాయి. అలాంటి ఆఫర్ సాయంతో జొమాటో నుంచి స్టార్ బక్స్ కాఫీని ఆర్డర్ చేశాడు. డిస్కౌంట్ పోను రూ.400 కాఫీకి అతడు చెల్లించింది రూ.190 మాత్రమే. డెలివరీ బోయ్ స్టార్ బక్స్ రెస్టారెంట్ కు వచ్చి కాఫీని డెలివరీ తీసుకుని, అక్కడే టేబుల్ వద్ద కూర్చున్న సందీప్ కు ఇచ్చి వెళ్లిపోయాడు. 

గోల్డ్ మెంబర్ అయితే డెలివరీ చార్జీ పడదు. ఇతరులకు అయితే డెలివరీ చార్జీ అదనంగా జొమాటో వసూలు చేస్తుంది. ట్విట్టర్ లో ఈ విషయాన్ని సందీప్ మాల్ పంచుకోగా.. డెలివరీ బోయ్ స్పందన గురించి ఓ యూజర్ ప్రశ్నించాడు. స్టార్ బక్స్ రెస్టారెంట్ లో కూర్చుని ఆర్డర్ చేసే విషయం డెలివరీ బోయ్స్ కు తెలుసని, దాంతో అతడి నుంచి ఆశ్చర్యం వ్యక్తం కాలేదని బదులిచ్చాడు. మరో యూజర్ అయితే.. డెలివరీ బోయ్ నిజంగా సంతోషపడి ఉంటాడని, తక్కువ సమయంలో ఎలాంటి పెట్రోల్ ఖర్చు లేకుండా అక్కడే డెలివరీ ఇచ్చాడని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News